Home News in Telugu విద్య సంస్థల్లో డిజిటల్ క్లాసులు !

విద్య సంస్థల్లో డిజిటల్ క్లాసులు !

టీవీలతో బోధన విద్యాక్యాలెండర్ పై కొత్త విద్యాసం వత్సరంపై విద్యాశాఖ దృష్టి సారించింది. క్లాస్ రూం బోధన సాధ్యమయ్యే అవకాశాలు లేనందున డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. జీరో ఇయర్ వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోవటమే కాకుండా భవిష్యత్తుకు ఆటంకం ఏర్పడుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ బోధనే ప్రత్యా మ్నాయం అవుతుందని చెప్తున్నారు. విద్యార్థులకు డిజిటల్ బోధన అందించి, పాఠాలను వర్క్ షీట్ల ద్వారా సాధన చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సరికొత్త విద్యావిధానం దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశాలున్నాయి. 6-10 తరగతుల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని గతంలోనే ఆన్లైన్ పాఠాలను రూపొందించారు. వాటిని అందుబాటులోకి తీసుకు వస్తే సాంకేతికంగా ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం గ్రహించింది. గ్రామీణ ప్రాంతాలు, పేద లకు స్మార్ట్ ఫోన్లు, డాటా, ఇంటర్నెట్ సౌకర్యం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నందున ఆన్లైన్ బోధనకు ప్రత్యామ్నయంగా డిజిటల్ బోధనకు సర్వం సిద్ధం చేస్తున్నది. టీశాట్, మన టీవీ, నిపుణవంటి టీవీ చానళ్ల ద్వారా డిజిటల్ బోధన చేయబోతు న్నారు. రోజూవారీ టైంటేబుల్ ప్రకారం పాఠాలు బోధించనున్నారు. అయితే, సిలబస్ తగ్గింపుపై అధి కారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, డిజిటల్ బోధన, వర్క్ షీట్ల సాధనకు టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వెబినార్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ను కూడా ఎస్సీ ఈ ఆర్టీ ఖరారు చేసినట్టు తెలిసింది.

అటు.. విద్యార్థుల ఇండ్లలో టీవీలు లేక పోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా టీచర్లు చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం టీశాట్, మనటీవీ, నిపుణ వంటి చానళ్ల ప్రసారాలు అన్ని కేబుల్ ఆపరేటర్ల ద్వారా జరుగడం లేదు. ముఖ్యంగా డీటీహెచ్ నుంచి ప్రసారాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లు, స్థానిక కేబుల్ ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపు తున్నారు. టీవీల్లో పాఠాలు బోధించే అంశాలపై సర్కారు ఆమోదించాల్సి ఉందని విద్యాశాఖ అధికా రులు పేర్కొన్నారు.

ఇంజినీరింగ్ లో ఆన్లైన్ క్లాసులు

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల బోధ నపై జే ఎన్టీ యూ హెచ్ అధికారులు దృష్టి సారిం చారు. దాదాపు 98 శాతం మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినడానికి అవకాశాలు ఉన్నాయని వర్సిటీ అధికారులు తెలిపారు. రోజు రెండు, మూడు సబ్జెక్టులకు ఆన్లైన్ క్లాసులు నిర్వ హించేలా విద్యాక్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్టు వర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ మంజూర్‌ హుస్సేన్ పేర్కొ న్నారు. ఆన్లైన్ లో కనిపించే విద్యార్థి ఇమేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని, దాన్ని అటెండెన్స్ గా పరిగణించను న్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

గురుకులాల్లో ఉపాధ్యాయులుగా సీనియర్‌ విద్యార్థులు..

గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ సంస్థ గ్రామ అభ్యాసన కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందులో జూనియర్ విద్యార్థులకు ఉపాధ్యాయులుగా సీనియర్ విద్యార్థులు బోధిస్తున్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌...

పాలీసెట్‌ 2020…. దరఖాస్తుకు మరోసారి అవకాశం ..

పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలీసెట్ 2020 దరఖాస్తుకు మరోసారి అవకాశం కలిపిస్తున్నటు వేములవాడ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఓ చర్చలో తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తక్కువ...

Telugu Current Affairs Pdf’s Download

Telugu Current Affairs: 15-July-2020 14-July-2020

1564 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రకటన..జూలై 16 ఆఖరు తేదీ …..

స్టాఫ్ కలెక్షన్ కమిషన్ (SSC) సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఫీజికల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ సాధించిన వారికీ...

Recent Comments