యూనివర్సిటీస్, విద్యాసంస్థలకు హోంమినిస్ట్రీ పర్మిషన్ : దేశ వ్యాప్తంగా యూనివర్సిటీలు, హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్ లో పెండింగ్ లో ఉన్న టర్మ్ ఎగ్జామ్స్ నిర్వహించుకునేందుకు హోం మినిస్ట్రీ సోమవారం పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు యూనియన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి హోంమినిస్ట్రీ లెటర్ రాసింది. తగిన జాగ్రత్తలు, కరోనా నివారణ నిబంధనలు పాటించటం, ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ లు తప్పనిసరి చేస్తూ ఎగ్జామ్స్ ను నిర్వహించవచ్చని . యూజీసీ నిబంధనల ప్రకారం టర్మ్ ఎగ్జామ్స్ కచ్చితంగా నిర్వహించాల్సి ఉండటంతో హోంమినిస్ట్రీ ఈ మేరకు పర్మిషన్ ఇచ్చింది.