ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అన్ని దేశాలను కలవరపరిచింది. వైరస్ నియంత్రణ సమయం లో విధించిన లాక్ డౌన్ కారణంగా విద్య, ఉద్యోగ అన్ని సంస్థల పై తీవ్రంగా నష్ట ప్రభావం చూపించింది. దింతో దేశ వ్యాప్తం గా నిరుద్యోగ రేటు, విద్యార్థులకు భవిష్యత్తుపై అందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ది అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం పేరిట ఒక పోర్టల్ ని ప్రవేశపెట్టింది. దీని వలన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కలిపించనుంది. తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా ఈ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏఐసిటిఈ ద్వారా ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఇది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో విద్యార్థులకు పని చేసే అవకాశం కలుగుతుంది. ప్రస్త్తుతం 23,970 సంస్థల్లో దాదాపు మూడు లక్షల ఇంటర్న్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. 2025 నాటికీ కోటి ఇంటర్న్షిప్స్ కలిపించాలినేది వీరి లక్ష్యం.
దేశంలో అన్ని రాష్టాల్లో, కేంద్ర ప్రాంతాల్లో అవకాశాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి మరియు ఇంజినీరింగ్ వారికి మాత్రమే ఉండే ఈ అవకాశాన్ని దాదాపు అన్ని విభాగాలకు విస్తరించడం దీని ప్రధాన ఉద్దేశాలో ఒకటి. వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నవారు అర్బన్ స్మార్ట్ సిటీ పరిధి ప్రాజెక్టులో ఇంటర్న్ గా పనిచేస్తారు. అర్బన్ ప్లానింగ్, అర్బన్ డిజైన్ వివిధ ఇంజినీరింగ్ బ్రాంచ్ లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మొబిలిటీ, ఫైనాన్స్, సోకేష సెక్టార్, పర్యావరణ సమస్యలు మరియు ఇతర ఎన్నో విభాగాల్లో అవగాహనా కలిపించుకునే అవకాశం లభిస్తుంది.
అర్హత :
- భారతీయులే ఉండాలి.
- బి.ప్లాన్, బీటెక్, బి.ఆర్క్, బిఎ, బిఎసి, బీకామ్, బిబిఎ, బీసీఏ, ఎల్ఎల్ తత్సమాన స్థాయిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.
- గ్రాడ్యుయేషన్ పూర్తి అయి 18 నెలల వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం పూర్తయ్యాక ఒక అభ్యర్థికి ఏడు ఇంటర్న్‌షిప్‌ల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఆధారంగా ఎంపికైన వారిని ఇంటర్వ్యూ నిమిత్తం పిలుస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికీ డిజిటల్ ఆఫర్ లెటర్ అందజెస్తారు. ఆఫర్ లెటర్ అంగీకరించడం, తిరస్కరించడం పోర్టల్‌లోనే చేయొచ్చు. ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ అందజెస్తారు. అభ్యర్థి పని తీరును ప్రాజెక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ అంచనావేస్తారు. దాని ఆధారంగా గ్రేడెను వేస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం :
- internship.aicte-india.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబందిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
- వెబ్సైటు లో రిజిస్టర్ బటన్ నొక్కాలి.
- అందుబాటులో ఉన్న ఆప్షన్స్ లో స్టూడెంట్స్ కేటగిరీ ని సెలెక్ట్ చేసుకోవాలి.
- పూర్తి వివరాలను నమోదు చేసిన తరువాత రిజిస్టర్ బటన్ నొక్కాలి. వెరిఫికేషన్ లింక్ ఈమెయిల్ కి వస్తుంది.
- దానికి సంబందించిన పత్రాలు అన్ని అప్లోడ్ చేయాలి. మీకు నచ్చిన ఇంటర్న్‌షిప్ ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలి.
- వీటిలో ఎంపికైతే ఇంటర్న్‌షిప్ అందిస్తారు. స్టైఫండ్ వివరాలతో కూడిన ఆఫర్ లెటర్ ద్వారా ఇంటర్న్‌షిప్ వ్యవధిని అందజెస్తారు.