పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలీసెట్ 2020 దరఖాస్తుకు మరోసారి అవకాశం కలిపిస్తున్నటు వేములవాడ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఓ చర్చలో తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకునందుకు విద్యార్థులకు మరోసారి అవకాశం కలిగిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన జయశంకర్ గారు వ్యవసాయ పాలిటెక్నిక్ 2020-21 సంవ్సతరంలో వాయిదా పడ్డ పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఈ పరీక్షను ఆగస్టులో నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్షా ఫీజు రూ.200 చెల్లించి ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
దరఖాస్తు వెబ్సైట్ : క్లిక్ చేయండి.