నిరుద్యోగులకు శుభవార్త. అమెజాన్ ఇండియా 20,000 ఉద్యోగాలను ప్రకటించింది. కస్టమర్ సర్వీస్ ఆర్గనైజషలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్, కోల్కతా, పుణె, బెంగుళూరు, చెన్నై లాంటి 11 ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. వర్క్ ఫ్రం హోమ్ కోరుకునే ఉద్యోగులకు ఇది అద్భుతమైన అవకాశం. ఇటీవల భారతదేశం లో అమెజాన్ దాదాపు 50,000 తాత్కాలిక ఉద్యోగాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా మరో 20,000 మందిని సీజనల్ జాబ్స్ కోసం చేర్చుకుంటామని పేర్కొంది. నెలకు 15,000 నుండి 20,000 వరకు జీతం లభిస్తుంది.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ మీద ఆధారపడుతున్నారు. దీని వలన ఇ కామర్స్ వారికి డిమాండ్ పెరుగుతుంది. ఇందువలన వచ్చే ఆరు నెలల కాలంలో వినియోగదారుల్లో మరింత డిమాండ్ పెరుగవచ్చు అని అమెజాన్ ఇండియా కస్టమర్ సర్వీస్ డైరెక్టర్ అక్షయ్ ప్రభు తెలియజెసారు. అందుకే ప్రస్తుతం తాత్కాలిక పోస్టులని భర్తీ చేస్తుంది అమెజాన్ ఇండియా. ఉద్యోగుల పని తీరును బట్టి ఏడాది చివరి నాటికీ పర్మినెంట్ చేయనుంది. భారతదేశంలో 2025 నాటికీ 10 లక్షల ఉద్యోగాలను ప్రకటిస్తామని అమెజాన్ తెలియజెసింది.